
ఆయన జనసమూహములతో ఇంక మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాటలాడ గోరుచు వెలుపల నిలిచియుండిరి.
అప్పుడొకడు–ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడ వలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను.
అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవానిచూచి–నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు? అని చెప్పి
తన శిష్యులవైపు చెయ్యి చాపి–ఇదిగో నా తల్లియు నా సహోదరులును;
పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నాతల్లియు ననెను.
ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.
ఆయన సహోదరులును తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయనచుట్టు కూర్చుండిరి.
వారు–ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును వెలుపల ఉండి, నీకోసరము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా
ఆయన–నా తల్లి నా సహోదరులు ఎవరని
తన చుట్టుకూర్చున్న వారిని కలయచూచి–ఇదిగో నా తల్లియు నా సహోదరులును;
దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను.