సజ్జ నుడు , తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును ; దుర్జ నుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును . హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును .
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను.
యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు .