నీవు యుక్తముగా చెప్పితివనిరి
సామెతలు 26:5

వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును.

మత్తయి 22:46

ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.

మార్కు 12:34

అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించినీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు.