యొక చిన్న బిడ్డను తీసికొని వారి మధ్యను నిలువబెట్టి, వానిని ఎత్తి కౌగిలించుకొని
మార్కు 10:16

ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.

మత్తయి 18:2

ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారి మధ్యను నిలువబెట్టి యిట్లనెను

మత్తయి 19:14

ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దింపగా యేసు–చిన్న పిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటి వారిదని వారితో చెప్పి

మత్తయి 19:15

వారి మీద చేతులుంచి, అక్కడనుంచి లేచిపోయెను.