ఆయన జనసమూహములతో ఇంక మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాటలాడ గోరుచు వెలుపల నిలిచియుండిరి.
అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడ వలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను.
అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవానిచూచి నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు? అని చెప్పి
ఆయన తల్లియు సహోదరులును ఆయనయొద్దకు వచ్చి , జనులు గుంపుగా ఉండుటచేత ఆయనదగ్గరకు రాలేక పోయిరి .
అప్పుడు నీ తల్లియు నీ సహోదరులును నిన్ను చూడ గోరి వెలుపల నిలిచియున్నారని యెవరో ఆయనకు తెలియజేసిరి .
అందుకాయన దేవుని వాక్యము విని , దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను .