తీసికొని వచ్చిరి
మత్తయి 9:1

తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా

మత్తయి 9:2-8
2

ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి కుమారుడా1 ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.

3

ఇదిగో శాస్త్రులలో కొందరుఇతడు దేవ దూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా

4

యేసు వారి తలంపులు గ్రహించిమీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు?

5

నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా?

6

అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచినీవు లేచి నీ మంచ మెత్తికొని నీ

7

వాడు లేచి తన యింటికి వెళ్లెను.

8

జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.

లూకా 5:18-26
18

ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువుగల యొక మనుష్యుని మంచము మీద మోసికొని , వానిని లోపలికి తెచ్చి , ఆయన యెదుట ఉంచటకు ప్రయత్నము చేసిరి గాని

19

జనులు గుంపుకూడి యుండి నందున , వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడక పోయెను గనుక, ఇంటిమీది కెక్కి పెంకులు విప్పి , మంచము తో కూడ యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి .

20

ఆయన వారి విశ్వాసము చూచి మనుష్యుడా , నీ పాపములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా ,

21

శాస్త్రులును పరిసయ్యులును దేవదూషణ చేయుచున్న యిత డెవడు ? దేవుడొ క్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింప గలడని ఆలోచించు కొనసాగిరి .

22

యేసు వారి ఆలోచన లెరిగి మీరు మీ హృదయముల లో ఏమి ఆలోచించుచున్నారు ?

23

నీ పాపములు క్షమింపబడి యున్నవని చెప్పుట సులభమా ? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా ?

24

అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచి నీవు లేచి, నీ మంచమెత్తికొని, నీ యింటికి వెళ్లుమని నీతో చెప్పుచున్నాననెను.

25

వెంటనే వాడు వారియెదుట లేచి, తాను పండుకొనియున్న మంచము ఎత్తి కొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను.

26

అందరును విస్మయమొంది నేడు గొప్ప వింతలు చూచితి మని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి.