ప్రకటించుచు
మార్కు 1:21

అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను.

మత్తయి 4:23

యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.

లూకా 4:43

ఆయన–నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింప వలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను.

లూకా 4:44

తరువాత ఆయన యూదయ సమాజమందిరములలో ప్రకటించుచుండెను.

వెళ్లగొట్టుచునుండెను
మార్కు 7:30

ఆమె యింటికి వచ్చి, తన కుమార్తె మంచముమీద పండుకొని యుండుటయు దయ్యము వదలిపోయి యుండుటయు చూచెను.

లూకా 4:41

ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయ లేదు.