(దయ్యములను) మాటలాడనియ్యలేదు.
మార్కు 1:25

అందుకు యేసుఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా

మార్కు 3:12

తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.

లూకా 4:41

ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలి పోయెను ; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి యుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయ లేదు .

అపొస్తలుల కార్యములు 16:16-18
16

మేము ప్రార్థనాస్థలమునకు వెళ్లుచుండగా (పుతోను అను) దయ్యముపట్టినదై, సోదె చెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగావచ్చెను.

17

ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారైయున్నారని కేకలువేసి చెప్పెను.

18

ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలిపోయెను.