మాలో ఏడుగురు సహోదరులుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను.
మార్కు 12:19-23
19

బోధకుడా, తనభార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను.

20

ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను

21

గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసికొనెను, వాడును సంతానము లేక చనిపోయెను; అటువలెనే మూడవవాడును చనిపోయెను.

22

ఇట్లు ఏడుగురును సంతానములేకయే చనిపోయిరి. అందరివెనుక ఆ స్త్రీయు చనిపోయెను.

23

పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ యేడుగురికిని భార్య ఆయెను గదా అని అడిగిరి.

లూకా 20:29-33
29

యేడుగురు సహోదరు లుండిరి. మొదటివాడొక స్త్రీని పెండ్లి చేసికొని సంతానము లేక చనిపోయెను.

30

రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లిచేసికొనిరి.

31

ఆ ప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను.

32

కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును?

33

ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి.

హెబ్రీయులకు 9:27

మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.