వారు యెరికోనుండి వెళ్లుచుండగా బహు జనసమూ హము ఆయనవెంట వెళ్లెను
మార్కు 10:46-52
46

వారు యెరికోపట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జనసమూహముతోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయియను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను.

47

ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను.

48

ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడుదావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను.

49

అప్పుడు యేసు నిలిచివానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డివానిని పిలిచిధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచు చున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి.

50

అంతట వాడు బట్టను పారవేసి, దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను.

51

యేసునేను నీకేమి చేయ గోరుచున్నావని వాని నడు గగా, ఆ గ్రుడ్డివాడుబోధకుడా, నాకు దృష్టి కలుగగా, ఆ గ్రుడ్డివాడుబోధకుడా, నాకు దృష్టి కలుగ జేయుమని ఆయనతో అనెను.

52

అందుకు యేసునీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయనవెంట చూపుపొంది వెళ్లెను.

లూకా 18:35-43
35

ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవప్రక్కను కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను.

36

జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా

37

వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్లుచున్నాడని వానితో చెప్పిరి.

38

అప్పుడు వాడు యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా

39

ఊరకుండుమని ముందర నడుచుచుండినవారు వానిని గద్దించిరి గాని, వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేసెను.

40

అంతట యేసు నిలిచి, వానిని తనయొద్దకు తీసికొని రమ్మనెను.

41

వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయ గోరుచున్నావని అడుగగా, వాడు ప్రభువా, చూపు పొందగోరుచున్నా ననెను.

42

యేసు చూపుపొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను;

43

వెంటనే వాడు చూపుపొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరు అది చూచి దేవుని స్తోత్రము చేసిరి.