మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను తుమ్మ కఱ్ఱతో దాని చేయవలెను .
దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర . అది చచ్చౌకముగా నుండవలెను . దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమైయుండవలెను .
దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయవలెను .
దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలెను ; దాని రెండు ప్రక్కల యందలి దాని రెండు మూలల మీద వాటిని ఉంచవలెను.
అవి దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములు . ఆ మోతకఱ్ఱలను తుమ్మ కఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను .
సాక్ష్యపు మందసము నొద్దనుండు అడ్డతెర యెదుట , అనగా శాసనముల మీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను ; అక్కడ నేను నిన్ను కలిసికొందును .
అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను . అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను .
మరియు సాయంకాల మందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను . అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము .
మీరు దానిమీద అన్య ధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింప కూడదు ; పానీయమునైనను దానిమీద పోయ కూడదు .
మరియు అహరోను సంవత్సరమున కొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాపపరిహారార్థబలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను . మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను . అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది .
మరియు యెహోవా మోషే తో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను .
వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను . ఆలాగు చేసినయెడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్ట దు .
వారు ఇయ్యవలసినది ఏమనగా , లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అర తులము ఇయ్యవలెను . ఆ తులము యిరువది చిన్నములు . ఆ అర తులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ .
ఇరువది సంవత్సరములు గాని అంతకంటె యెక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నియ్యవలెను .
అది మీ ప్రాణము లకు పరిక్రయధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అర తులము కంటె ఎక్కువ ఇయ్య కూడదు . బీదవాడు తక్కువ ఇయ్య కూడదు .
నీవు ఇశ్రాయేలీ యుల యొద్దనుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసికొని ప్రత్యక్షపు గుడారముయొక్క సేవ నిమిత్తము దాని నియమింపవలెను . మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీ యులకు జ్ఞాపకార్థముగా నుండును .
మరియు యెహోవా మోషే తో ఇట్లనెను కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి
ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను .
ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులును తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను .
మరియు అతడు తుమ్మకఱ్ఱతో ధూపవేదికను చేసెను. దాని పొడుగు మూరెడు దాని వెడల్పు మూరెడు, అది చచ్చౌకముగా నుండెను. దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు ఏకాండమైనవి.
దానికి, అనగా దాని కప్పుకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను.
దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములుగా దానికి రెండు ఉంగరములను బంగారుతో చేసి దానిరెండు ప్రక్కలయందు దాని రెండు మూలలయందు దాని జవకు దిగువను వాటిని వేసెను.
దాని మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను.
బంగారు వేదికను అభిషేక తైలమును పరిమళ ధూప ద్రవ్యములను శాలా ద్వారమునకు తెరను
సాక్ష్యపు మందసము నెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను .
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించి నట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర యెదుట బంగారు ధూపవేదికను ఉంచి
దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను.