మూడు పురములను
ద్వితీయోపదేశకాండమ 4:41-43
41

అంతకుముందొకడు పగపట్టక పరాకున తన పొరుగువాని చంపినయెడల

42

చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పుదిక్కున, యొర్దాను ఇవతల మూడు పురములను వేరుపరచెను. అట్టివాడెవడైనను ఆ పురములలో దేనిలోనికినైనను పారిపోయి బ్రదుకును.

43

అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీయులకు గిలాదులో నున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే.

ద్వితీయోపదేశకాండమ 19:8-10
8

మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణముచేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరచి, నీ పితరులకు ఇచ్చెదనని చెప్పిన సమస్తదేశమును నీకిచ్చిన యెడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు

9

నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకాజ్ఞాపించిన యీ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుచు, ఈ మూడు పురములు గాక మరి మూడు పురములను ఏర్పరచుకొనవలెను.

10

ప్రాణము తీసిన దోషము నీమీద మోపబడకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషియొక్క ప్రాణము తీయకుండవలెను.

యెహొషువ 20:7-9
7

అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిర్యతర్బాను ప్రతిష్ఠపరచిరి.

8

తూర్పుదిక్కున యొర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీయుల గోత్రములోనుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి.

9

పొరబాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువకమునుపు అక్కడికి పారిపోయి హత్యవిషయమై ప్రతిహత్య చేయు వానిచేత చంపబడక యుండునట్లు ఇశ్రాయేలీయులకందరికిని వారిమధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి.