kinsman
లేవీయకాండము 25:25

నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమి్మన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చినయెడల తన సహోదరుడు అమి్మనదానిని అతడు విడిపించును.

లేవీయకాండము 25:49

వాని పినతండ్రియేగాని పినతండ్రి కుమారుడేగాని వాని వంశములో వాని రక్తసంబంధియేగాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన యెడల తన్ను తాను విడిపించుకొనవచ్చును.

రూతు 4:3-6
3

అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూ భాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినునట్లు నేనొకసంగతి తెలియజేయవలెనని యున్నాను.

4

ఈ పుర నివాసుల యెదుటను నా జనుల పెద్దల యెదుటను ఆ భూమిని సంపాదించుకొనుము ; ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన యెడల విడిపింపుము , దాని విడిపింప నొల్లని యెడల అది స్పష్టముగా నాతో చెప్పుము . నీవు గాక దాని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు ; నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను . అందుకతడు నేను విడిపించెద ననెను .

5

బోయజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వానిపేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయినవాని భార్యయైన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండియు దాని సంపాదింపవలెనని చెప్పగా

6

ఆ బంధువుడు నేను దానిని విడిపించు కొనలేను , నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో , నేను దాని విడిపింప లేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను .

యిర్మీయా 32:8

కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హన మేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకారములోనున్న నాయొద్దకు వచ్చిబెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని

కట్టడ
సంఖ్యాకాండము 35:29

ఇవి మీ సమస్త నివాసస్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ.

1 సమూయేలు 30:25

కావున నాటనుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరచి నియమించెను .