బెన్యామీను కుమారులు ముగ్గురు; బెల బేకరు యెదీయవేలు.
బెల కుమారులు అయిదుగురు; ఎస్బోను ఉజ్జీ ఉజ్జీయేలు యెరీమోతు ఈరీ. వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు; వీరి వంశములో చేరినవారు ఇరువది రెండువేల ముప్పది నలుగురు.
బేకరు కుమారులు జెమీరా యోవాషు ఎలీయెజెరు ఎల్యోయేనై ఒమీ యెరీమోతు అబీయా అనాతోతు ఆలెమెతు; వీరందరును బేకరు కుమారులు.
వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు, వీరందరును ఇరువదివేల రెండువందలు.
యెదీయవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు బెన్యామీను ఏహూదు కెనయనా జేతాను తర్షీషు అహీషహరు.
యెదీయవేలు కుమారులైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరిలో యుద్ధమునకు పోతగిన పరాక్రమ శాలులు పదునైదువేల రెండు వందలమంది యుండిరి.
షుప్పీము హుప్పీము ఈరు కుమారులు, అహేరు కుమారులలో హుషీము అను ఒకడుండెను.
అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను.
బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,