ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయించుము.
ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లువారిని, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయముగలవారిని, తమ తమ సేనలనుబట్టి నీవును అహరోనును లెక్కింపవలెను.
వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను . ఆలాగు చేసినయెడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్ట దు .
సమాజములో చేరినవారి వెండి పరిశుద్ధస్థలపు తులముచొప్పున నాలుగువందల మణుగుల వెయ్యిన్ని ఐదువందల డెబ్బదియైదు తులములు.
ఈ పన్ను ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో , అనగా ఆరులక్షల మూడు వేల ఐదు వందల ఏబది మందిలో తలకొకటికి అర తులము .