మరియు బిలాము బాలాకుతో బలిపీఠము మీది నీ దహనబలియొద్ద నిలిచియుండుము, నేను వెళ్లెదను; ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో; ఆయన నాకు కనుపరచునది నీకు తెలియచేసెదనని చెప్పి మెట్టయెక్కెను.
అతడు వారితో యీ రాత్రి ఇక్కడనే ఉండుడి; యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదననెను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బసచేసిరి.