అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది.
సంఖ్యాకాండము 1:27

యూదా గోత్రములో లెక్కింపబడిన వారు డెబ్బది నాలుగువేల ఆరువందలమందియైరి.

సంఖ్యాకాండము 26:22

వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు డెబ్బదియారువేల ఐదు వందలమంది.