వారు ఒకటే ఊదినయెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీయొద్దకు కూడి రావలెను.
సంఖ్యాకాండము 1:4-16
4

మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు, మీతో కూడ ఉండవలెను.

5

మీతో కూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగా రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు;

6

షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు

7

యూదా గోత్రములో అమీ్మనాదాబు కుమారుడైన నయస్సోను

8

ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు

9

జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు

10

యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు

11

బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను

12

దాను గోత్రములో ఆమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు

13

ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు

14

గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు

15

నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి.

16

వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును.

సంఖ్యాకాండము 7:2

దాని ఉపకరణములన్నిటిని బలిపీఠమును దాని పాత్రలన్నిటిని చేయించి, అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులును గోత్ర ముఖ్యులును లెక్కింపబడిన వారిమీద అధిపతులునైన ఇశ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి.

నిర్గమకాండము 18:21

మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని, వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, వారిమీద న్యాయాధిపతులను నియమింపవలెను.

ద్వితీయోపదేశకాండమ 1:15

కాబట్టి బుద్ధికలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని, మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యిమందికి ఒకడును, నూరుమందికి ఒకడును ఏబదిమందికి ఒకడును, పదిమందికి ఒకడును వారిని, మీమీద నేను నియమించితిని.