దేవుడు లేచును గాక ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధినుండి పారిపోవుదురు గాక.
పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురు గాక.
యెహోవా, లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడ రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము.
యెహోవా బాహువా , లెమ్ము లెమ్ము బలము తొడుగుకొమ్ము పూర్వపు కాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా ? మకరమును పొడిచినవాడవు నీవే గదా?