sanctify
లేవీయకాండము 27:21

ఆ పొలము సునాదసంవత్సరమున విడుదలకాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును.

లేవీయకాండము 25:29-31
29

ఒకడు ప్రాకారముగల ఊరిలోని నివాసగృహమును అమి్మనయెడల దాని అమి్మనదినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును; ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకొనవచ్చును.

30

అయితే ఆ సంవత్సరదినములు నిండకమునుపు దాని విడిపింపనియెడల ప్రాకారముగల ఊరిలోనున్న ఆ యిల్లు కొనినవానికి వాని తరతరములకు అది స్థిరముగానుండును. అది సునాదకాలమున తొలగిపోదు.

31

చుట్టును ప్రాకారములులేని గ్రామములలోని యిండ్లను వెలిపొలములుగా ఎంచవలెను. అవి విడుదలకావచ్చును; అవి సునాదకాలములో తొలగిపోవును.

సంఖ్యాకాండము 18:14

ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును.

కీర్తనల గ్రంథము 101:2-7
2

నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను . నీవు ఎప్పుడు నాయొద్దకు వచ్చెదవు ? నా యింట యథార్థహృదయముతో నడుచుకొందును

3

నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనియ్యను

4

మూర్ఖచిత్తుడు నా యొద్దనుండి తొలగిపోవలెను దౌష్ట్యమును నేననుసరింపను .

5

తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయముగలవారిని నేను సహింపను

6

నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైనవారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకులగుదురు .

7

మోసము చేయువాడు నా యింట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు .