నాకే దాసులైయున్నారు
లేవీయకాండము 25:55

ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు; నేను ఐగుప్తుదేశములోనుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన యెహోవాను.

రోమీయులకు 6:22

అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము ; దాని అంతము నిత్య జీవము .

1 కొరింథీయులకు 7:21-23
21

దాసుడవై యుండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెడల, స్వతంత్రుడవగుట మరి మంచిది.

22

ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు.

23

మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి.