
నీ తండ్రికి మానాచ్ఛాదనముగానున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.
నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ తండ్రిదే.
నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తెయొక్కయైనను నీ తల్లి కుమార్తెయొక్కయైనను మానాచ్ఛాదనమును తీయకూడదు.
నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయకూడదు; అది నీది.
నీ తండ్రివలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.
నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.
నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.
నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు; ఆమె నీ పినతల్లి.
నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.
నీ సహోదరుని భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ సహోదరుని మానము.
ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు; వారు ఆమె రక్తసంబంధులు; అది దుష్కామప్రవర్తన.
నీ భార్య బ్రదికియుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానాచ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లిచేసికొనకూడదు.
అపవిత్రతవలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు.
తన తండ్రి భార్యతో శయనించినవాడు తన తండ్రి మానాచ్ఛాదనమునుతీసెను; వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.
ఒకడు తన కోడలితో శయనించినయెడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి; వారి ప్రాణాపరాధము వారిమీదనుండును.
ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనేగాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలను వాడును వాని దిసమొలను ఆమెయు చూచిన యెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానాచ్ఛాదనమును తీసెను; తన దోషశిక్షను తాను భరించును.
కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదనమును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను; ఆమె తన రక్తధారాచ్ఛాదనమును తీసివేసెను; వారి ప్రజలలోనుండి వారిద్దరిని కొట్టివేయవలెను.
నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమునేగాని నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమునేగాని తీయకూడదు; తీసినవాడు తన రక్తసంబంధియొక్క మానాచ్ఛాదనమును తీసెను; వారు తమ దోషశిక్షను భరించెదరు.
పినతల్లితోనేగాని పెత్తల్లితోనే గాని శయనించినవాడు తన తలిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను, వారు తమ పాపశిక్షను భరించెదరు; సంతానహీనులై మరణమగుదురు.
ఒకడు తన సహోదరుని భార్యనుయెడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను; వారు సంతానహీనులైయుందురు.