
నేను ఊలయియను నది ప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను . నేను కన్ను లెత్తి చూడగా , ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచియుండెను ; దానికి రెండు కొమ్ములు , ఆ కొమ్ములు ఎత్తయినవి గాని యొకటి రెండవ దానికంటె ఎత్తుగా ఉండెను; ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది .
అతడు రాజైనతరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలు దిక్కుల విభాగింపబడును . అది అతని వంశపువారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింపబడదు , అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును , అతని వంశపువారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు.