దాని పరిమాణ వివరమేదనగా, ఉత్తరదిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, దక్షిణ దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, తూర్పు దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, పడమటి దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు.
తూర్పుతట్టు నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆ తట్టున యోసేపుదనియు బెన్యామీనుదనియు దానుదనియు మూడు గుమ్మములుండవలెను.
దక్షిణపుతట్టు నాలుగు వేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆ తట్టున షిమ్యోనుదనియు ఇశ్శాఖారుదనియు జెబూలూనుదనియు మూడు గుమ్మములుండవలెను.
పడమటితట్టు నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణముగలది. ఆ తట్టున గాదుదనియు ఆషేరుదనియు నఫ్తాలిదనియు మూడు గుమ్మములుండవలెను.
దాని కైవారము పదునెనిమిదివేల కొలకఱ్ఱల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాటనుండి ఆ పట్టణమునకు పేరు.
ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.