వాకిలి వెడల్పు పది మూరలు , తలుపు ఇరుప్రక్కల అయిదేసి మూరలు , దాని నిడివిని కొలువగా నలుబది మూరలు , దాని వెడల్పు ఇరువది మూరలు .
అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మూరలాయెను , వాకిలి ఆరు మూరలు ;వెడల్పు ఏడు మూరలు .
ఇది అతి పరిశుద్ధస్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా ఇరువది మూరలును ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు ఇరువది మూరలు నాయెను.
తరువాత అతడు మందిరపు గోడను కొలువగా ఆరు మూరలాయెను , మందిరపు ప్రక్కలనున్న మేడ గదులను కొలువగా నాలుగేసి మూరలాయెను .
అతడు తూర్పు తట్టున నున్న గుమ్మము నకు వచ్చి దాని సోపానములమీది కెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు , అనగా మొదటి గడప వెడల్పు బార న్నర తేలెను.
మరియు కావలిగది నిడివియు వెడల్పును బార న్నర , కావలి గదులకు మధ్య అయిదేసి మూరల యెడముండెను. గుమ్మముయొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు బార న్నర యెడము.
గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బార న్నర తేలెను.
గుమ్మపు ద్వారము కొలువగా అది యెనిమిది మూరలై యుండెను, దానిస్తంభములు రెండేసి మూరలు ; అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను.
తూర్పు గుమ్మపు ద్వారముయొక్క కావలి గదులు ఇటు మూడును , అటు మూడును ఉండెను, మూడు గదులకు కొలత యొకటే . మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకు కొలత యొకటే .
ఆ యా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు పది మూరలును నిడివి పదు మూడు మూరలును తేలెను.
కావలి గదుల ముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుప్రక్కల నుండెను, ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడ యుండెను; గదులైతే ఇరుప్రక్కలను ఆరు మూరల ఎత్తుగలవి.
ఒకగది కప్పునుండి రెండవదాని కప్పువరకు గుమ్మమును కొలువగా ఇరువది యయిదు మూరల వెడల్పు తేలెను, రెండు వాకిండ్లమధ్య గోడను అదే కొలత.
అరువదేసి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను . గుమ్మము చుట్టునున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించెను.
బయటి గుమ్మము నొద్దనుండి లోపటి గుమ్మపు ద్వారమువరకు ఏబది మూరలు .
కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టు నున్న గోడలకును ప్రక్కగదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను , గోడలోని స్తంభములకును కిటికీలుండెను ; ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి యుండెను.