అతడు తూర్పు తట్టున నున్న గుమ్మము నకు వచ్చి దాని సోపానములమీది కెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు , అనగా మొదటి గడప వెడల్పు బార న్నర తేలెను.
మరియు ఉత్తరపు వైపున బయటి ఆవరణము చూచుచుండు గుమ్మపు నిడివిని వెడల్పును
ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొనిపోయి దాని కొలువగా అదే కొలత యాయెను.
అయితే దేశ జనులు నియామక కాలములయందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చునప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్లవలెను , దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను . తాము వచ్చిన దారినే యెవరును తిరిగి పోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను .
దాని ఇరుప్రక్కలనున్న మూడేసి కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్యగోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను, అనగా నిడివి ఏబది మూరలు వెడల్పు ఇరువది యైదు మూరలు కనబడెను.
అతడు దక్షిణ మార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను ; దాని కొలత అదే .
మరియు దాని కావలిగదులును స్తంభములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీలుండెను , దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరువది యైదు మూరలు
దాని కావలిగదులకును స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే ; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను ; నిడివి యేబది మూరలు , వెడల్పు ఇరువది యైదు మూరలు .
ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొనిపోయి దాని కొలువగా అదే కొలత యాయెను.
దాని కావలిగదులకును స్తంభములకును దాని మధ్యగోడలకును అదే కొలత; దాని కిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కీటికీలుండెను ; దాని నిడివి యేబది మూరలు దాని వెడల్పు ఇరువది యైదు మూరలు .