జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి , కొండలలోను లోయ లన్నిటిలోను అతని కొమ్మలు పడెను , భూమి యందున్న వాగులలో అతని శాఖలు విరిగి పడెను, భూ జను లందరును అతని నీడను విడిచి అతనిని పడియుండ నిచ్చిరి.
నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసెదను , ఆకాశ పక్షు లన్నియు నీమీద వ్రాలునట్లుచేసి నీవలన భూ జంతువు లన్నిటిని కడుపార తిననిచ్చెదను,
నీ మాంసమును పర్వతముల మీద వేసెదను , లోయలన్నిటిని నీ కళేబరములతో నింపెదను .
నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరును ఇశ్రాయేలు పర్వతముల మీద కూలుదురు , నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చెదను .
నీవు పొలము మీద కూలుదువు , నేనే మాట యిచ్చియున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .
యెహోవా కోపము సమస్త జనముల మీదికి వచ్చు చున్నది వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చు చున్నది ఆయన వారిని శపించి వధకు అప్పగించెను .
వారిలో చంపబడినవారు బయట వేయబడెదరు వారి శవములు కంపు కొట్టును వారి రక్తమువలన కొండలు కరగిపోవును .
ఆకాశ సైన్య మంతయు క్షీణించును కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును . ద్రాక్షావల్లినుండి ఆకు వాడి రాలునట్లు అంజూరపుచెట్టునుండి వాడినది రాలునట్లు వాటి సైన్య మంతయు రాలిపోవును .
నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఎదోము మీద తీర్పుతీర్చుటకు నేను శపించిన జనము మీద తీర్పుతీర్చుటకు అది దిగును
యెహోవా ఖడ్గము రక్త మయమగును అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము చేతను పొట్లేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్పబడును ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును.
వాటితోకూడ గురుపోతులును వృషభములును కోడెలును దిగిపోవుచున్నవి ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది .