గోమెరును అతని సైన్య మంతయును ఉత్తర దిక్కులలోనుండు తోగర్మాయును అతని సైన్యమును జనము లనేకములు నీతోకూడ వచ్చును.
ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థలములలోనుండి నీవును నీతోకూడ జనము లనేకములును గుఱ్రము లెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి
అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెనుఉత్తర దిక్కునుండి కీడు బయలుదేరి యీ దేశనివాసులందరిమీదికి వచ్చును.
సీయోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి; పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి; యెహోవానగు నేను ఉత్తరదిక్కునుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను,
అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టు నున్నవి; అందరును కత్తి పాలై చచ్చిరి ; వారు సజీవుల లోకములో భయంకరులైనవారు , వారు సున్నతిలేనివారై పాతాళము లోనికి దిగిపోయిరి , గోతిలోనికి దిగిపోయిన వారితో కూడ వారు అవమానము నొందుదురు .
హతులైన వారిమధ్య దానికిని దాని సమూహమునకును పడకయొకటి ఏర్పడెను , దాని సమాధులు దానిచుట్టు నున్నవి; వారందరును సున్నతిలేనివారై హతులైరి ; వారు సజీవుల లోకములో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయినవారితో కూడ వారును అవమానము నొందుదురు , హతులైన వారిమధ్య అది యుంచబడును .