ఓనువారిలోను పిబేసెతు వారిలోను యౌవనులు ఖడ్గము చేత కూలుదురు . ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు .
ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటికమ్మును , ఐగుప్తీయుల బల గర్వము అణచబడును , మబ్బు ఐగుప్తును కమ్మును , దాని కుమార్తెలు చెర లోనికి పోవుదురు .
నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.
నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసెదను , పాడై పోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడై యుండును , ఐగుప్తీయులను జనముల లోనికి చెదరగొట్టుదును , ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును .
ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నలువది సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీయులు చెదరిపోయిన జనులలోనుండి నేను వారిని సమకూర్చెదను.