
వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకొని మనుష్యులను భక్షించున దాయెను.
యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారు పేరుపెట్టి యెహోయాహాజును ఐగుప్తుదేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను.
యెహోయాకీము ఫరో యిచ్చిన ఆజ్ఞచొప్పున దేశముమీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచువచ్చెను. దేశపు జనులయొద్దనుండి వారి వారికి నిర్ణయమైన చొప్పున వసూలుచేసి అతడు ఫరోనెకోకు చెల్లించెను.
యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమున పదకొండు సంవత్సరములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయా కుమార్తెయగు జెబూదా.
ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడిచెను.