గనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచుదురు.
ఆలకించుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు
మరియు నీవు గోధుమలును యవలును కాయధాన్యములును చోళ్లును సజ్జలును తెల్ల జిలకరను తెచ్చుకొని , యొక పాత్రలో ఉంచి , నీవు ఆ ప్రక్క మీద పండుకొను దినముల లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను , మూడు వందల తొంబది దినములు నీవు ఈలాగున భోజనము చేయుచు రావలెను ;
నీవు తూనికె ప్రకారము , అనగా దినమొకటింటికి ఇరువది తులముల యెత్తుచొప్పున భుజింపవలెను , వేళ వేళకు తినవలెను ,
నీళ్లు కొలప్రకారము అరపడిచొప్పున ప్రతిదినము త్రాగవలెను , వేళ వేళకు త్రాగవలెను ;
యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను ;
నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను .
అందుకు అయ్యో , ప్రభువా , యెహోవా , నేనెన్నడును అపవిత్రత నొందినవాడను కానే , బాల్యము నుండి నేటి వరకును చచ్చినదానినైనను మృగములు చీల్చినదానినైనను నేను తినినవాడను కానే , నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడ లేదే అని నేననగా
ఆయన చూడుము , మనుష్య మలమునకు మారుగా నీకు గో మలము నేను నిర్ణయించి యున్నాను ; దీనితో నీవు నీ భోజనము సిద్ధపరుచుకొనుమని సెలవిచ్చి
నర పుత్రుడా , ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండ చేసినందున వారు తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు , నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయ మొందుదురు .
అన్న పానములు లేకపోయినందున వారు శ్రమనొంది విభ్రాంతిపడి యొకని నొకడు చూచుచు తాము కలుగజేసికొనిన దోషమువలన నశించిపోవుదురు .