నేను దీని జ్ఞాపకము చేసికొనగా
కీర్తనల గ్రంథము 77:7-11
7

ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా?

8

ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయెనా?

9

దేవుడు కటాక్షింపమానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా?(సెలా.)

10

అందుకు నేనీలాగు అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము.

11

యెహోవా చేసిన కార్యములను,పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును

నాకు ఆశ పుట్టుచున్నది.
విలాపవాక్యములు 3:24-29
24

యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయనయందు నేను నమి్మక యుంచుకొనుచున్నాను.

25

తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా ళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.

26

నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.

27

¸యవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.

28

అతనిమీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండ వలెను.

29

నిరీక్షణాధారము కలుగునేమో యని అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను.

కీర్తనల గ్రంథము 119:81

(కఫ్‌) నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను

కీర్తనల గ్రంథము 130:7

ఇశ్రాయేలూ, యెహోవామీద ఆశపెట్టుకొనుము యెహోవాయొద్ద కృప దొరుకును. ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.

హబక్కూకు 2:3

ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును.