ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను పిలువనంపించి తీసికొనివచ్చి, నేను పాతిపెట్టిన యీ రాళ్లమీద అతని సింహాసనము ఉంచెదను, అతడు రత్నకంబళిని వాటిమీదనే వేయించును.
ఇంక సింహాసనములను వేయుట చూచితిని ; మహా వృద్ధుడొకడు కూర్చుండెను . ఆయన వస్త్రము హిమమువలె ధవళముగాను, ఆయన తల వెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను ; దాని చక్రములు అగ్నివలె ఉండెను.
అగ్నివంటి ప్రవాహము ఆయనయొద్ద నుండి ప్రవహించుచుండెను . వే వేలకొలది ఆయనకు పరిచారకులుండిరి ; కోట్లకొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి , తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరువబడెను .
అప్పుడు నేను చూచుచుండగా , ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను ; తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను .
మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయెను ; సమయము వచ్చువరకు అవి సజీవులమధ్యను ఉండవలెనని యొక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయెను.
రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా , ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారునిపోలిన యొకడు వచ్చి , ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను .
సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను . ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగి పోదు ; ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు .