ప్రతి వాడు తన దోషముచేతనే మృతినొందును; ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్లే పులియును.
మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము.
తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనని మీరు చెప్పుచు వచ్చెదరే; ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ఈ సామెత మీ రెందుకు పలికెదరు ?
నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలు కరు ; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు .