దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పు వారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయాదర్శనములను కనుడి
వ్యర్థమైన మాటలు పలుకుచు, అబద్ధికుడై ద్రాక్షారసమునుబట్టియు మద్యమునుబట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన యెడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును .
వారు నన్ను తృణీకరించు వారితోమీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు; ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితోమీకు కీడు రాదనియు చెప్పుచు, యెహోవా ఆజ్ఞనుబట్టి మాట లాడక తమకు తోచిన దర్శనమునుబట్టి పలుకుదురు.
ఇశ్రాయేలు రాజు నాలుగువందల మంది ప్రవక్తలను సమకూర్చి నేను రామోత్గిలాదుమీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారి నడిగెను. అందుకువారుపొమ్ము, దేవుడు రాజు చేతికి దానినప్పగించునని చెప్పిరి.
అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా యినుపకొమ్ములు చేయించుకొనివచ్చి సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను.
ప్రవక్తలందరును ఆ ప్రకారముగానే ప్రవచించుచు యెహోవా రామోత్గిలాదును రాజు చేతికి అప్పగించును, దానిమీదికిపోయి జయమొందుము అనిరి.
మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని ప్రవక్తలు రాజు విషయమై యేక ముఖముగా మేలునే పలుకుచున్నారు,దయచేసి నీమాటను వారి మాటలకు అనుకూలపరచి మేలునే ప్రవచింపుమనగా
ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్గిలాదుమీదికి పోయి పడిపోవునట్లు ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి.
అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవాయెదుట నిలువబడి నేను అతని ప్రేరేపించెదనని చెప్పగా యెహోవా దేనిచేతనని అతని నడిగెను.
అందుకు ఆ యాత్మనేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా యెహోవా నీవు అతనిని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారముగా చేయుమని సెలవిచ్చెను.