
నీవు మ్రొక్కుకొననియెడల నీయందు ఆ పాపముండదు.
వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దానిగూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును.
అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను.