వివేకియైనవాడు
సామెతలు 10:19

విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.

సామెతలు 11:13

కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును.

సామెతలు 13:16

వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.

but
సామెతలు 15:2

జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.

ప్రసంగి 10:3

బుద్ధిహీనుడు తన ప్రవర్తననుగూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికి తెలియజేయును.

ప్రసంగి 10:12-14
12

జ్ఞానునినోటిమాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మింగివేయును.

13

వాని నోటిమాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెఱ్ఱితనము.

14

కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగక యుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు; నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో యెవరు తెలియజేతురు?