షిమ్యోను కుమారులైన యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షావూలు.
షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు; యామీనీయులు యామీను వంశస్థులు; యాకీనీయులు యాకీను వంశస్థులు;
జెరహీయులు జెరహు వంశస్థులు; షావూలీయులు షావూలు వంశస్థులు.
షిమ్యోను కుమారులు నెమూయేలు యామీను యారీబు జెరహు షావూలు.