
మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతోకూడ రాను; త్రోవలో మిమ్మును సంహరించెదనేమో అని మోషేతో చెప్పెను.
–ప్రభువా, నామీద నీకు కటాక్షము కలిగినయెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతోకూడ రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమునుక్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసికొను మనెను
మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.