pillars of shittim
నిర్గమకాండము 26:37

ఆ తెరకు అయిదు స్తంభ ములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింప వలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను.

నిర్గమకాండము 36:38

దాని అయిదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను; వాటి అయిదు దిమ్మలు ఇత్తడివి.

ఎస్తేరు 1:6

అక్కడ ధవళ ధూమ్రవర్ణములుగల అవి సెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభములమీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను.