ఆ మోతకఱ్ఱలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దానియొద్దనుండి తీయకూడదు;
1 రాజులు 8:8

వాటి కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడవుగా ఆ దండెలుంచబడెను గాని యివి బయటికి కనబడ లేదు. అవి నేటివరకు అక్కడనే యున్నవి.

2 దినవృత్తాంతములు 5:9

వాటి కొనలు గర్భాలయము ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండెలుంచబడెను గాని అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే యున్నవి.