And
ద్వితీయోపదేశకాండమ 27:5

అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను; వాటిమీద ఇనుప పనిముట్టు పడకూడదు.

ద్వితీయోపదేశకాండమ 27:6

చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దానిమీద నీ దేవుడైన యెహోవాకు దహనబలుల నర్పింపవలెను.

యెహొషువ 8:31

యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండమీద కట్టించెను. దానిమీద వారు యెహోవాకు దహనబలులను సమాధాన బలులను అర్పించిరి.