అందుకు అతడు యెహోవా చెప్పిన మాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయమువరకు మిగిలిందంతయు మీ కోరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను.
ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు పరిశుద్ధదినము. అది యెహోవా విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్షనొందును.
విశ్రాంతి దినమున మీరు మీ యిండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను.
అయితే నేను ఆరవయేట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను; అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయును.
మీరు ఎనిమిదవ సంవత్సరమున విత్తనములు విత్తి తొమి్మదవ సంవత్సరమువరకు పాత పంట తినెదరు; దాని పంటను కూర్చువరకు పాతదానిని తినెదరు.