యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము
కీర్తనల గ్రంథము 6:10

నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.

కీర్తనల గ్రంథము 9:19

యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోవుదురు గాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక.

కీర్తనల గ్రంథము 9:20

యెహోవా, వారిని భయపెట్టుము తాము నరమాత్రులమని జనులు తెలిసికొందురు గాక.(సెలా.)

కీర్తనల గ్రంథము 34:5

వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును.