మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అను ఇద్దరిని పట్టుకొని, ఓరేబు బండమీద ఓరేబును చంపిరి, జెయేబు ద్రాక్షల తొట్టియొద్ద జెయేబునుచంపి మిద్యానీయులను తరుముకొనిపోయిరి. ఓరేబు జెయేబుల తలలను యొర్దాను అవతలికి గిద్యోనునొద్దకు తెచ్చిరి.
జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జెబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను.
యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను
హెరెసు ఎగువనుండి తిరిగి వచ్చి, సుక్కోతు వారిలో ఒక ¸యవనుని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బది యేడుగురు మనుష్యులను పేరు పేరుగా వివరించి చెప్పెను.
అప్పుడతడు సుక్కోతువారి యొద్దకు వచ్చి జెబహు సల్మున్నా అను వారిచేతులు నీ చేతికి చిక్కినవి గనుక నా అలసియున్న నీ సేనకు మేము ఆహారము ఇయ్యవలెను అని మీరు ఎవరివిషయము నన్ను దూషించితిరో ఆ జెబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి
ఆ ఊరిపెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను బొమ్మజెముడును తీసికొని వాటివలన సుక్కోతువారికి బుద్ధి చెప్పెను.
మరియు నతడు పెనూయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరివారిని చంపెను.
అతడుమీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టివారని జెబహును సల్మున్నాను అడుగగా వారునీవంటివారే, వారందరును రాజకుమారులను పోలియుండిరనగా
అతడువారు నా తల్లి కుమారులు నా సహోదరులు; మీరు వారిని బ్రదుకనిచ్చిన యెడల
యెహోవా జీవముతోడు, మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన యెతెరును చూచి నీవు లేచి వారిని చంపుమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు.
అప్పుడు జెబహు పల్మున్నాలు ప్రాయముకొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జెబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసికొనెను.