రక్షింపుము
కీర్తనల గ్రంథము 26:9

పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము.

కీర్తనల గ్రంథము 27:2

నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లికూలిరి

కీర్తనల గ్రంథము 55:23

దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమి్మకయుంచియున్నాను.

కీర్తనల గ్రంథము 139:19

దేవా,నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు నరహంతకులారా, నాయొద్దనుండి తొలగిపోవుడి.