
ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేనను కొంటినా? అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.
ఆత్మ నన్నెత్తి తోడు కొనిపోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్నిచేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొనిపోయినప్పుడు, యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను.
అప్పుడు వారు–ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండ లేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.