spare
యోబు గ్రంథము 10:20

నా దినములు కొంచెమే గదా తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు

యోబు గ్రంథము 10:21

అంధకారము మరణాంధకారముగల దేశమునకు

యోబు గ్రంథము 14:5

నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలలసంఖ్య నీకు తెలిసేయున్నది.మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించియున్నావు

యోబు గ్రంథము 14:6

కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువరకు వారు విశ్రమమునొందునట్లు వారివైపు చూడకయుండుము.

లేకపోకమునుపు
ఆదికాండము 5:24

హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.

ఆదికాండము 42:36

అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి–మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను.

యోబు గ్రంథము 14:10-12
10

అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు.నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు?

11

తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు.

12

ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు.ఎవరును వారిని నిద్ర లేపజాలరు.