నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?
శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడు నాకు దూరముగా నుండకుము.
యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము.
ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.
నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచుకొనుచున్నారు. ఆహా ఆహా యిప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు.
యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌనముగా నుండకుము నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము.