ఇశ్రాయేలీయులారా , యెహోవాను నమ్ముకొనుడి . ఆయన వారికి సహాయము వారికి కేడెము
అహరోను వంశస్థులారా , యెహోవాను నమ్ముకొనుడి . ఆయన వారికి సహాయము వారికి కేడెము
యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమ్మికయుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము .
యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి
ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురు గాక.
ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురు గాక.
ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవాయందు భయభక్తులుగలవారు అందురు గాక.
యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు.
ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను.
ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయేయున్నవి. యెహోవాను స్తుతించుడి.
ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించియున్నాడు. అది ఆయన భక్తులకందరికిని ఆయన చెంతజేరిన జనులగు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి.
మరియు -మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను.